logo
Published : 01/12/2021 01:03 IST

నేటి నుంచి తెదేపా గౌరవ సభలు


సమావేశమైన పార్టీ ముఖ్య నేతలు

గుంటూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్‌ గడువు పొడిగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తీర్మానించింది. జిల్లా పార్టీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ అధ్యక్షతన జోనల్‌ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, సంగం డెయిరీ ఛైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌, ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మంగళవారం సమావేశమయ్యారు. శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌లకు ఏజంట్లను నియమించాలన్నారు. శాసనసభలో వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు కుటుంబంపై నోటికొచ్చినట్లు మాట్లాడి రాజకీయాలతో సంబంధం లేని మహిళను అవమానపర్చినందుకు ప్రతి నియోజకవర్గంలో బుధవారం నుంచి 15 రోజులు పాటు గౌరవ సభలు నిర్వహించాలని సూచించారు. జగన్‌ ప్రభుత్వ తీరును గ్రామ, మండల స్థాయి నుంచి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను తక్షణమే పూర్తి చేయాలని, అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ ఏజంట్లను నియమించాలని జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య తీర్మానాలు ప్రవేశపెట్టారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని