logo
Published : 01/12/2021 01:03 IST

‘గృహ హక్కు పేరుతో డబ్బు వసూళ్లా?’


ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న తెదేపా నేతలు, కార్యకర్తలు

ఈపూరు, న్యూస్‌టుడే : గతంలో ప్రభుత్వం నిర్మించిన పేదల ఇళ్లకు శాశ్వత గృహ హక్కు పేరుతో ఇపుడు లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెదేపా ఆధ్వర్యంలో మంగళవారం ఈపూరులో భారీస్థాయిలో ఆందోళన చేశారు. పార్టీ నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. గ్రామ కూడలి నుంచి ప్రదర్శనగా వెళ్లి ఈపూరు బీసీకాలనీలో ఇళ్ల లబ్ధిదారులను కలిసి వారి ఆవేదన విన్నారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టినా పంటలు చీడపీడల కారణంగా నాశనమయ్యాయని, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ తరుణంలో.. మేం ఎప్పుడో నిర్మించుకున్న ఇంటికి రూ.10 వేలు చెల్లించాలని ఇపుడు గ్రామ వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని, చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుందని, ప్రభుత్వ పథకాలు కూడా ఆగిపోతాయని బెదిరిస్తున్నారని కొంతమంది మహిళలు తెలిపారు. అనంతరం నేతలు, కార్యకర్తలు ప్రదర్శనగా ఈపూరు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేసి.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గృహ రుణాలు రద్దు చేస్తానని మాటిచ్చిన జగన్‌.. ఇపుడు ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరుతో పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక డబ్బు తీసుకోకుండా ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని తెదేపా అధినేత చంద్రబాబు మాటిచ్చారని జీవీ తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, పార్టీ మండల అధ్యక్షుడు కాటం కోటేశ్వరరావు, సీనియర్‌ నేతలు గన్నమనేని వెంకయ్య, అయినాల కోటేశ్వరరావు, బొల్లా సుబ్బారావు, తిరుమలశెట్టి బాలయ్య, విడపలపాటి హనుమయ్య, నర్రా కిషోర్‌, గోపు వీరాంజినేయులు, నందిగం అక్కారావు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని