logo
Published : 01/12/2021 01:04 IST

స్త్రీలపై హింస నివారణ సమాజ బాధ్యత

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: దేశంలో దళిత, గిరిజన మహిళలపై దాడులు నివారించడం సమాజం బాధ్యత అని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ అన్నారు. జిల్లాపరిషత్తు ప్రాంగణంలోని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ సమావేశ మందిరంలో దళిత, గిరిజన మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి దళిత, గిరిజన మహిళలు, బాలికలపై దాడుల నివారణకు 16 రోజులు అంతర్జాతీయ ప్రచారోద్యమానికి పిలుపు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జి ఏపీడీ కృష్ణవేణి మాట్లాడుతూ బాధిత మహిళలు, బాలికలకు అండగా ఉంటున్నామన్నారు. తొలుత కలెక్టరేట్‌ ఎదుట, తర్వాత జిల్లాపరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో మహిళలు మానవహారం నిర్వహించి మహిళలపై దాడులను నివారించాలని నినాదాలు చేశారు. సమావేశంలో దళిత స్త్రీ శక్తి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్తలు హేమలత, భాగ్యలక్ష్మి, నాయకులు సుజాత, మేరీ నిర్మల, జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని