logo
Published : 02/12/2021 03:08 IST

గృహ హక్కు పథకంపై చైతన్యం


సమీక్షిస్తున్న కలెక్టరు వివేక్‌ యాదవ్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించి చైతన్యపర్చాలని జిల్లా కలెక్టరు వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ మినీ సమావేశ మందిరంలో గృహ హక్కు పథకం అమలు తీరు తెన్నులపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ ఈ పథకాన్ని వినియోగించుకోవడం వల్ల లబ్ధిదారులకు శాశ్వతంగా కలిగే హక్కులు, ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. నిర్దేశిత సమయం లోపు లబ్ధిదారుల గృహాలను రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుణాలు తీసుకున్న వారు, ఎలాంటి రుణాలు తీసుకోని లబ్ధిదారుల వివరాలతో కూడిన జాబితా సంబంధిత అధికారుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్‌కుమార్‌, రాజకుమారి, డీఆర్‌వో కొండయ్య, ప్రత్యేక ఉప కలెక్టరు లలిత, గుంటూరు ఆర్‌డీవో భాస్కరరెడ్డి, జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు బసవయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని