logo
Published : 03/12/2021 02:55 IST

‘డబ్బు కట్టమని బలవంతం చేయవద్దు’

రొంపిచర్ల, న్యూస్‌టుడే : పేదలందరికీ మేలు చేసేందుకే వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పాలి తప్ప ఎవరినీ బలవంతం చేసి నగదు వసూలు చేయకూడదని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులకు సూచించారు. మండలంలోని రొంపిచర్ల, వడ్లమూడివారిపాలెం గ్రామాల్లో గురువారం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంపూర్ణ హక్కు పత్రం పొందితే బ్యాంకు రుణాలు, ఇల్లు తనఖా పెట్టుకోవటం, అమ్ముకోవటం చేయవచ్చని చెప్పారు. లక్ష్యాల మేరకు ఓటీఎస్‌ నగదు వసూళ్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. అనంతరం నగదు చెల్లించి పలువురు లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, గురుజాల డీఎల్‌డీవో అర్జునరావు, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ రమణనాయక్‌, గృహ నిర్మాణశాఖ ఈఈ, డీఈ, సర్పంచులు గానుగపంట వెంకాయమ్మ, గెల్లి చిన కోటిరెడ్డి పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని