logo
Updated : 03/12/2021 03:15 IST

బిల్లుల పోటు సర్దుబాటు 

జిల్లావినియోగదారులనుంచి రూ.97.26 కోట్ల మినహాయింపు


ఏపీఈఆర్‌సీ నిర్ణయంతో ఊరట

ఈనాడు,గుంటూరు విద్యుత్తు వినియోగదారులకు ట్రూఅప్‌ ఛార్జీలు, ట్రూఅప్‌ సర్‌ఛార్జీల నుంచి ఉపశమనం లభించింది. ఆగస్టు నెల నుంచి వసూలు చేస్తున్న ఈ ఛార్జీలను వసూలు చేయవద్దని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి ఇప్పటికే ఆదేశించింది. దీంతో నవంబరు నెలలో వసూలు చేయలేదు. దీంతోపాటు సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వసూలు చేసిన ఛార్జీలను డిసెంబరు నెలలో ఇస్తున్న బిల్లులో సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్‌సీ డిస్కంలను ఆదేశించింది. ఈమేరకు ప్రస్తుతం ఇస్తున్న బిల్లుల్లో గతంలో వసూలు చేసిన ఛార్జీల మొత్తాన్ని మినహాయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులకు రూ.97.26 కోట్ల మేర సొమ్ము ప్రస్తుత బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. దీంతో డిసెంబరు నెలలో విద్యుత్తు వినియోగదారులకు ఉపశమనం లభించనుంది.

విద్యుత్తు వినియోగానికి సంబంధించి 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు అప్పట్లో డిస్కంలకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వడ్డీతో సహా ట్రూఅప్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబరు నెలలో ఇచ్చి బిల్లు నుంచి ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి వరకు వసూలుచేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు నెలలో బాదుడు మొదలైంది. సాధారణంగా వచ్చే బిల్లుకు తోడు సర్దుబాటు ఛార్జీలు అదనంగా వేయడంతో వినియోగదారులకు భారంగా మారింది. ఎల్‌టీ, హెచ్‌టీ వినియోగదారుల నుంచి రెండు నెలల్లో రూ.97.26 కోట్లు అదనంగా వసూలుచేశారు. దీంతో ఒక్కో కనెక్షన్‌పై 15 నుంచి 20 శాతం వరకు అదనంగా బిల్లు వచ్చింది. కరోనా సమయంలో ఈ స్థాయిలో భారం వేయడంపై వినియోగదారుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. కరోనాతో అన్ని రంగాలు కుదేలై ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యుత్తు బిల్లుల మోత ప్రజల నడ్డి విరిచింది. అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి నవంబరు నెల నుంచి ట్రూఅప్‌ ఛార్జీల వసూలును నిలిపివేయాలని డిస్కంలను ఆదేశించింది. ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తాన్ని డిసెంబరు బిల్లులో సర్దుబాటు చేయాలని ఆదేశించింది. దీంతో విద్యుత్తు వినియోగదారులకు సర్దుబాటు భారం నుంచి ఉపశమనం లభించింది.

సెప్టెంబరు నెల (రూ.లక్షల్లో)

సర్కిల్‌  ఎల్‌టీ  హెచ్‌టీ  మొత్తం

సీఆర్‌డీఏ 560.84 823.80 1384.64

గుంటూరు 2533.46 1112.88 3646.34

అక్టోబరు నెల

సీఆర్‌డీఏ 586.87 763.47 1350.34

గుంటూరు 2269.78 1075.67 3345.45

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని