logo
Published : 03/12/2021 02:55 IST

ఇతర దేశాల నుంచి 10 మంది రాక

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ఇతర దేశాల నుంచి జిల్లాకు చెందిన 10 మంది గురువారం వచ్చారు. వారిలో ఐదుగురు హైదరాబాద్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. గుంటూరు వచ్చిన మిగిలిన ఐదుగురికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు శుక్రవారం రానున్నాయి. ఇంతకుముందు ఐదుగురికి పరీక్షలు నిర్వహించాగా అందరికీ నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ సూచనలతో విదేశాల నుంచి వచ్చిన వారికి తొలిరోజే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పాజిటివ్‌గా తేలిన నమూనాలను జన్యు విశ్లేషణ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ ప్రయోగశాలకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని