logo
Published : 03/12/2021 02:55 IST

పోస్టాఫీసులో తాత్కాలిక ఉద్యోగి చేతివాటం

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే : దేవాలయంలో పని చేసే ఓ పూజారి తను సంపాదించిన రూ.3 లక్షలు గ్రామీణ తంతి తపాలా కేంద్రంలో డిపాజిట్‌ చేయమని అక్కడ పని చేసే తాత్కాలిక ఉద్యోగికి ఇచ్చారు. ఆ డిపాజిట్‌పై నెలనెలా వడ్డీ ఇచ్చే విధంగా డిపాజిట్‌ చేయాలని పూజారి కోరారు. ఏడాది అవుతున్నా ఒకసారి కూడా వడ్డీ కూడా ఆయనకు ఇవ్వలేదు. మరో మహిళ కూలీనాలి చేసి సంపాదించిన డబ్బును నెలనెల తంతి తపాలా కేంద్రంలో పొదుపు చేసింది. ఆమెకు ఎలాంటి పుస్తకం ఇవ్వలేదు. ఖాతాలోనే జమ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు అక్కడ పనిచేసే ఆ తాత్కాలిక ఉద్యోగి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది ఖాతాదారుల డబ్బును స్వాహా చేసిన ఘటన పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువులో వెలుగుచూసింది. కష్టపడి సంపాదించిన డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం, పిల్లలు చదువు, పెళ్లిళ్ల కోసం సాధారణ కుటుంబాలకు చెందిన పలువురు తంతి తపాలా కేంద్రంలో పొదుపు చేస్తున్నారు. గత ఏడాది తుమ్మలచెరువు పోస్టాఫీసులో పని చేసే ఉద్యోగి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో తాత్కాలిక ఉద్యోగి ఒకరు బాధ్యతలు చేపట్టారు. ఎప్పటిలాగే పొదుపు సొమ్మును నెలనెలా అక్కడ పని చేసే తాత్కాలిక ఉద్యోగికి ఇచ్చారు. కొంతమంది ఖాతాదారులకు పుస్తకాలు మొదటి నెలలో ఇచ్చారు. తరువాత ఆ పుస్తకాల్లో డబ్బులు కట్టినట్లు పుస్తకంలో రాసి, నగదును తంతా తపాలా కేంద్రంలో జమ చేయలేదు. మరికొంత మంది ఖాతాదారులకు పుస్తకాలే ఇవ్వలేదు. కొన్నాళ్ల తరువాత పుస్తకాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. మరికొంతమంది ఖాతాదారుల వద్ద డిపాజిట్లను తీసుకొని వారికి ఎలాంటి బాండ్లు ఇవ్వలేదు. ఇలా గ్రామంలో చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసి స్వాహా చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.15 లక్షల వరకు నగదును స్వాహా చేసినట్లు సమాచారం. గ్రామంలో జరిగిన నగదు గోల్‌మాల్‌పై తపాలశాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని