logo
Published : 03/12/2021 02:55 IST

వాతావరణ మార్పులతోనే తామర ఉద్ధృతి


యడ్లపాడు : పైరును పరిశీలిస్తున్న ప్రధాన శాస్త్రవేత్త మాధవీరెడ్డి తదితరులు

మేడికొండూరు, యడ్లపాడు, న్యూస్‌టుడే: జిల్లాలోని బండారుపల్లి, విశదల, మేరికపూడి, చందవరం, సొలస గ్రామాల్లోని మిర్చి పంటలను గురువారం బెంగళూరులోని భారత ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు మాధవిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీధర్‌, రచన పరిశీలించి మాట్లాడారు. మిరపకు కొత్త రకం తామర పురుగు ఆశించిందని, వాతావరణ మార్పులతో ఉద్ధృతి ఎక్కువగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో తామర పురుగు ఎక్కువగా ఉందన్నారు. నివారణకు సస్య రక్షణలు చేపట్టాలని, పురుగు మందులతో పాటు వేపనూనె పిచికారీ చేయాలని చెప్పారు. పిచికారీ చేసేటప్పుడు మొక్క, నేల మొత్తం మందు తగేలేలా చూడాలన్నారు. భూమిపై వేప పిండి చల్లడం మంచిదన్నారు. పంట చుట్టూ జొన్న, మొక్క జొన్న నాటడం వల్ల మేలు జరుగుతుందన్నారు. సామూహికంగా పొలంలో బునుగు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. కర్షకులు విచక్షణరహితంగా మందులు పిచికారీ చేయకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు పాటించాలన్నారు. మిరప చెట్టులో రోగ నిరోధక శక్తి పెంపునకు సూక్ష్మ పోషక మిశ్రమాలు పిచికారీ చేయాలన్నారు. అనంతరం తామర పురుగు సోకిన పూత, కాయలను తమతో పాటు తీసుకెళ్లారు. అంతకుముందు అన్నదాతలు వారికి సమస్యలు తెలిపారు. ఒక్కో ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టామని, తామర పురుగుతో ఆకు ముడుచుకుపోతోందని, పూత, పిందె రాలిపోతోందని, చెట్టుకున్న కాయ పనికి రాకుండా పోతోందని వాపోయారు. ప్రధాన శాస్త్రవేత్తల వెంట సీనియర్‌ ఉద్యాన పరిశోధన స్థానం, లాం, గుంటూరుకు చెందిన శిరీష, ఉద్యాన సహాయ సంచాలకులు, ఎఫ్‌ఏసీ గుంటూరు పద్మావతమ్మ, నరసరావుపేట ఉద్యాన సహాయ సంచాలకులు బీజే బెన్నీ, తెనాలి ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి తదితరులున్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని