logo
Published : 03/12/2021 03:13 IST

ఓటీఎస్‌ను రాజకీయ కోణంలో చూడొద్దు

మాట్లాడుతున్న జేసీ దినేష్‌కుమార్, పక్కన ఆర్డీఓ శేషిరెడ్డి

ఈపూరు, వినుకొండ రూరల్, శావల్యాపురం, వినుకొండ, న్యూస్‌టుడే : ఓటీఎస్‌ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని, ఇది గృహ లబ్ధిదారులకు ఉపయోగమని జిల్లా సంయుక్త కలెక్టరు దినేష్‌ కుమార్‌ అన్నారు. ఈపూరు పంచాయతీ కార్యాలయంలో గురువారం ఆయన ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ అనుమానాలను జేసీకి నివేదించారు. గృహ లబ్ధిదారుల్లో అనేకమంది నిరుపేదలున్నారని, ప్రభుత్వం ఉచితంగా నిర్మిస్తుందనుకుని పక్కా ఇళ్లు నిర్మించుకున్నారని, ఇపుడు అధికారులు వచ్చి మీరు ప్రభుత్వానికి బకాయి ఉన్నారు..రూ.పది వేలు చెల్లించమంటే ఎక్కడ తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులు ఎంత బకాయి ఉన్నప్పటికీ ఒకేసారి వారు రూ.10 వేలు చెల్లిస్తే సరిపోతుందని, చెల్లించినవారికి పక్కా రిజిస్ట్రేషన్‌ చేసి గృహ హక్కు కల్పిస్తామని ఆయన చెప్పారు.  వినుకొండ మండలం చీకటీగలపాలెం సచివాలయాన్ని తనిఖీ చేశారు. శావల్యాపురం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వినుకొండ పురపాలక సంఘంలోని 4, 8 వార్డుల సచివాలయాలను తనిఖీ చేసిన అనంతరం జాషువా కళా ప్రాంగణంలో గురువారం మండల పరిషత్, పురపాలక సంఘం సచివాలయాల సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో జేసీ పాల్గొన్నారు. నరసరావుపేట ఆర్డీఓ శేషిరెడ్డి, తహశీల్దారు సుధాకర్, ఎంపీడీఓ ఎస్‌.ప్రసాద్‌బాబు, ఈపూరు సర్పంచి పల్లమీసాల చెంచయ్య పాల్గొన్నారు. 

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని