logo
Published : 03/12/2021 03:13 IST

అద్దె భవనాలు.. అరకొర సేవలు!

కారువ΄రులో అద్దె భవనం ఆవరణలో సిబ్బంది విధులు 

 బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లోని పలుచోట్ల ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు కరవయ్యాయి. అద్దె భవనాల్లో చాలీచాలని చిన్న గదుల్లో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన సదుపాయాలు కరవై వైద్య సిబ్బంది, రోగులు ఇబ్బంది పడుతున్నారు. అరకొర సేవలు అందుతుండటంతో ప్రజలు ప్రైవేట్‌ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. అయితే, గ్రామాల్లో వైఎస్సార్‌ ఆరోగ్య క్లినిక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. నిధుల కొరతతో భవనాల నిర్మాణం పనులు పూర్తి కాలేదు.
రేపల్లె అర్బన్, బాపట్ల, న్యూస్‌టుడే గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. కొన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో కూర్చునేందుకు కనీస వసతి కూడా లేదు. రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో 99 ఉప కేంద్రాలుండగా 79 చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రేపల్లె, నగరం మండలాల్లో బేతపూడి, పేటేరు, మంత్రిపాలెం, కర్లపాలెంలో సొంత భవనాలున్నాయి. గుడ్డి కాయలంకలో పాత పంచాయతీ భవనం, పిరాట్లంకలోని తుపాను షెల్టరు, లంకెవానిదిబ్బ, అల్లూరు, ఖాజీపాలెం, భవనవారిపాలెం గ్రామాల్లోని సామాజిక భవనాల్లో ఆరోగ్య కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. విలువైన ఔషధాలు భద్రపర్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షం కురిస్తే జల్లులకు మందులు పాడైపోతాయని ఆందోళన చెందుతున్నారు. 
నిధుల కొరతతో పూర్తికాని నిర్మాణాలు: పల్లె వాసులకు అన్ని ప్రభుత్వ రంగ సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా సచివాలయ ఆవరణలోనే వైద్య సేవలు అందించేలా వైఎస్సార్‌ క్లినిక్‌ భవన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. పనులు ప్రారంభించిన గుత్తేదారులు పలుచోట్ల భవనాలకు శ్లాబ్‌ వేయించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా అందపోవడంతో అంతటితో పనులు నిలిపేశారు. బిల్లు బకాయిలు వస్తే పూర్తి చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు పేర్కొంటున్నారు. సొంత భవన సదుపాయం కలిగితే ఇప్పటి వరకు తాము పడిన ఇబ్బందులు తీరతాయని భావించిన ప్రజలు, ఆరోగ్య కార్యకర్తల ఆశ అడియాసే అయింది.
మెరుగైన సేవలందిస్తున్నాం
ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేకున్నా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాం. ఆరోగ్య కార్యకర్తలు నిత్యం గ్రామీణులకు అందుబాటులో ఉంటున్నారు. గ్రామాల్లో పర్యటించి సీజనల్‌ వ్యాధులు బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు. వైఎస్సార్‌ క్లినిక్‌ భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సమస్య పరిష్కారమవుతుంది.
- నరసింహనాయక్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, తెనాలి


 

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని