logo

ఒక్కరోజే ఓటీఎస్‌కు రూ.3.78 కోట్ల చెల్లింపులు

రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేలా తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుందని కలెక్టరు వివేక్‌ యాదవ్‌ తెలిపారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించిన

Published : 05 Dec 2021 01:21 IST

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేలా తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుందని కలెక్టరు వివేక్‌ యాదవ్‌ తెలిపారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఏక మొత్త రుణ వసూలు మెగా మేళాలో జిల్లా వ్యాప్తంగా 3,883 మంది లబ్ధిదారులు రూ.3.78 కోట్ల రుణాలను చెల్లించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు 16,303 మంది లబ్ధిదారులు రూ.15.82 కోట్ల ఏక మొత్తం రుణాలను చెల్లించారని తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం పొంది గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఈ పథకం చక్కని అవకాశమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని