logo

‘హాజరు 75 శాతం ఉంటేనే దీవెనకు అర్హత’

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందేందుకు అర్హత సాధిస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా

Published : 05 Dec 2021 01:21 IST

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందేందుకు అర్హత సాధిస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి నవంబరు 30 వరకు జ్ఞానభూమి పోర్టల్‌లో విద్యార్థుల హాజరు నమోదు చేయాలని, లేకపోతే అనర్హులవుతాని పేర్కొన్నారు. ఇకపై నెల పూర్తయిన వారం లోపు జ్ఞానభూమి పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. నమోదు చేయకపోతే ఆ విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు మాఫీ చేయడం ఆయా కళాశాలల బాధ్యత అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని