logo

తామర పురుగు దెబ్బ

ఈపూరు మండలం ఇనుమెళ్లలో గుర్రం నాగేశ్వరరావు ఏడు ఎకరాల్లో మిర్చి సాగుచేయగా, పంట పూతదశకు చేరుకుంది. ఎకరానికి రూ.70వేలు చొప్పున ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ తరుణంలో పైరుకు తామర పురుగు సోకింది.

Published : 05 Dec 2021 01:21 IST

ఈపూరు మండలం ఇనుమెళ్లలో గుర్రం నాగేశ్వరరావు ఏడు ఎకరాల్లో మిర్చి సాగుచేయగా, పంట పూతదశకు చేరుకుంది. ఎకరానికి రూ.70వేలు చొప్పున ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ తరుణంలో పైరుకు తామర పురుగు సోకింది. ప్రారంభంలో రెండు సాళ్లతో మొదలైన పురుగు కొద్ది రోజుల్లోనే పొలం మొత్తం వ్యాపించింది. నివారణకు ప్రతి నాలుగు రోజులకొకసారి మందులు పిచికారి చేస్తున్నా, ఏమాత్రం పురుగు ఉద్ధృతి తగ్గకపోవడంతో శనివారం ట్రాక్టరుతో దున్నేసి పైరును తొలగించాడు.

- ఈపూరు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని