logo
Published : 05/12/2021 01:21 IST

విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం


మాట్లాడుతున్న ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గించేందుకు ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తుందని విద్యాశాఖ ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు పేర్కొన్నారు. శ్రీకృష్ణచైతన్య జూనియర్‌ కళాశాలలో గేమ్‌ సంస్థ సహకారంతో ఏపీఎస్‌ఈఆర్టీ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఆర్జేడీ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించేందుకు తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. ప్రాథమిక దశలో 21 పాఠశాలలను తొమ్మిదో తరగతి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంపిక చేశామన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని సూచించారు. డీవైఈవో సుధాకరరెడ్డి మాట్లాడుతూ గేమ్‌ ప్రణాళికను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో విద్యార్థులు స్వయం ఉపాధి పొందేందుకు వీలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బీఎం సుభాని, డీఎస్‌వో మధుకుమార్‌, షేక్‌ మహమ్మద్‌ గౌస్‌, శిక్షకులు బ్రహ్మనాయుడు, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని