logo

ఓటీఎస్‌ సద్వినియోగం చేసుకోండి

ఓటీఎస్‌ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ చెప్పారు. చిలకలూరిపేట ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటీఎస్‌ లబ్ధిదారులకు రుణంతో పాటు వడ్డీ కూడా మాఫీ అవుతుందన్నారు.

Published : 05 Dec 2021 01:21 IST


ప్రసంగిస్తున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: ఓటీఎస్‌ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ చెప్పారు. చిలకలూరిపేట ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటీఎస్‌ లబ్ధిదారులకు రుణంతో పాటు వడ్డీ కూడా మాఫీ అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ.10వేలు, పురపాలక సంఘంలో రూ.20వేలు, నగరపాలక సంస్థలో లబ్ధిదారులు రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నగదు చెల్లించిన వారికి శాశ్వత గృహ హక్కు పథకం అందజేస్తారని చెప్పారు. జిల్లాలో 13వేల మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని చెప్పారు. పేట పురపాలక సంఘ పరిధిలో 370 ఓటీఎస్‌కు నగదు చెల్లించారన్నారు. పురపాలక సంఘ ఛైర్మన్‌ ఎస్‌కే రఫాని, కమిషనర్‌ డి.రవీంద్ర, తహశీల్దార్‌ సుజాత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని