logo

నైపుణ్యాలు పెంచుకుంటేనే చేనేతకు మనుగడ

చేనేత రంగం మనుగడ సాగించాలంటే మార్కెట్‌లో పోటీ తట్టుకోవాలి.. ఆ దిశగా నేత కార్మికులు నూతన డిజైన్లు ఆవిష్కరిస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వి.వినుజకుమార్‌ పేర్కొన్నారు. కార్మికుల నైపుణ్యాలు పెంచే దిశగా కేంద్ర జౌళి శాఖ చెరుకుపల్లి మండలం

Published : 07 Dec 2021 05:32 IST


మాట్లాడుతున్న డీడీ వినుజకుమార్‌

చెరుకుపల్లి, న్యూస్‌టుడే : చేనేత రంగం మనుగడ సాగించాలంటే మార్కెట్‌లో పోటీ తట్టుకోవాలి.. ఆ దిశగా నేత కార్మికులు నూతన డిజైన్లు ఆవిష్కరిస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వి.వినుజకుమార్‌ పేర్కొన్నారు. కార్మికుల నైపుణ్యాలు పెంచే దిశగా కేంద్ర జౌళి శాఖ చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో 45 రోజుల శిక్షణలో పాల్గొనే వారికి రోజుకు రూ.300 భృతి కల్పించటంతోపాటు వృత్తిలో కొనసాగేవారికి వర్క్‌షెడ్‌ నిర్మాణానికిగాను రూ.1.32 లక్షల సాయం అందిస్తుందని తెలిపారు. ఆరుంబాక సొసైటీ పరిధిలో ఇంతకు ముందు శిక్షణ పొందిన 35 మంది కార్మికులకు వర్క్‌షెడ్లు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర పథకాలు ఏవి కావాలన్నా తాము మంజూరు చేసి ప్రోత్సహించేందుకు ముందుంటామని హామీ ఇచ్చారు. ఆరుంబాక చేనేత సంఘం కార్మికులకు అండగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంఘ అధ్యక్షుడు దివి రాంబాబును అభినందించారు. కార్యక్రమంలో ఏడీ టీఎస్‌ఎన్‌ రెడ్డి, దివి శ్రీనివాసరావు, కందుల వెంకటేశ్వరరావు, ఓరుగంటి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని