logo

నేటి నుంచి ఉద్యోగ సంఘాల నిరసనలు

ఉద్యోగుల న్యాయమైన హక్కులను సాధించుకునేందుకు మంగళవారం నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఏపీ ఎన్జీవో కల్యాణ మండపంలో అన్ని సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొనడం,

Published : 07 Dec 2021 05:32 IST


ఐక్య నినాదాలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఉద్యోగుల న్యాయమైన హక్కులను సాధించుకునేందుకు మంగళవారం నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఏపీ ఎన్జీవో కల్యాణ మండపంలో అన్ని సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఆయా కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొనడం, నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలియజేయడం తద్వారా ప్రభుత్వం నుంచి హక్కులను సాధించుకునేందుకు ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కాంట్రాక్టు, పొరుగుసేవల ఉద్యోగులు ముందుకు రావాలన్నారు. సమావేశంలో నిరసనలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మన్‌, కన్వీనర్‌ ఘంటసాల శ్రీనివాసరావు, శెట్టిపల్లి సతీష్‌కుమార్‌, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌, కన్వీనర్‌ కనపర్తి సంగీతరావు, శ్రీనివాసశర్మ, ఏపీ ఎన్జీవో సంఘం నగర అధ్యక్షుడు కె.ఎన్‌.సుకుమార్‌, వివిధ సంఘాల నాయకులు జి.వేణుగోపాల్‌, సోమేశ్వర్‌, పి.ప్రేమ్‌కుమార్‌, రామకృష్ణ, రవీంద్రారెడ్డి, కె.బసవలింగరాజు, ఎస్‌.మల్లేశ్వరరావు, బి.సుశీల, కె.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని