logo
Published : 07 Dec 2021 05:32 IST

అన్నదాతకు అండగా నాబార్డు

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: రైతులు తమ పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు అవసరమైన గిడ్డంగులు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి కేంద్రం బ్యాంకు రుణాలపై మూడు శాతం రాయితీ ఇస్తుందని ఏపీ నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌కుమార్‌ జన్నావర్‌ అన్నారు. ఆయన సోమవారం రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావుతో కలిసి కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా విరివిగా రుణాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. విజయవాడలో 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 9 వరకు అమరావతి మేళా పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందన్నారు. మేళాలో కర్షకులు స్టాల్స్‌ ఏర్పాటు చేసుకొని తమ పంటలు, ఉప ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చన్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతో పండించిన కారం, పసుపులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుందన్నారు. అంతకుముందు వెంకటేశ్వరరావు ఆయనకు శిక్షణ కేంద్రంలో పెంచుతున్న 28 రకాల గోవులను చూపించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. సుధీర్‌కుమార్‌ వెంట గుంటూరు ఏజీఎం కేఆర్‌డీ కార్తిక్‌, జీఎంలు నగేష్‌కుమార్‌, రమేష్‌బాబు, కృష్ణా జిల్లా ఏజీఎం విజయ్‌ తురిమెళ్ల తదితరులున్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని