logo

గ్రామీణుల ఆదాయం పెంచేందుకు కృషి

తేనెటీగల పెంపకం ద్వారా గ్రామీణ యువత, మహిశల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కేవీఐసీ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర సంచాలకుడు ఎస్‌.గ్రీప్‌ అన్నారు. బాపట్ల మండలం ముత్తాయపాలెంలో తేనెటీగల పెంపకంపై ‘సెర్చ్‌’ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు

Published : 07 Dec 2021 05:32 IST


మాట్లాడుతున్న కేవీఐసీ సంచాలకుడు గ్రీప్‌

బాపట్ల, న్యూస్‌టుడే : తేనెటీగల పెంపకం ద్వారా గ్రామీణ యువత, మహిశల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కేవీఐసీ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర సంచాలకుడు ఎస్‌.గ్రీప్‌ అన్నారు. బాపట్ల మండలం ముత్తాయపాలెంలో తేనెటీగల పెంపకంపై ‘సెర్చ్‌’ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. గ్రీప్‌ మాట్లాడుతూ.. నాణ్యమైన తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందన్నారు. వ్యవసాయంలో పంటలు సాగు చేస్తూ పెట్టెల్లో తేనెటీగలు పెంచి తేనె సేకరించి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం సాధించవచ్చన్నారు. కేవీఐసీ అదనపు సంచాలకుడు ఏజీ రావు, బాధ్యుడు టీవీరావు, సెర్చ్‌ సంస్థ కార్యదర్శి సీహెచ్‌ పార్థసారథి, పీసీవో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు