logo

నూరు శాతం టీకాలతోనే రక్ష

ఒమిక్రాన్‌ రకం కరోనా వ్యాప్తి ఓవైపు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు 40 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు అందించేలా కేంద్ర ఆరోగ్య శాఖ ఆలోచన చేస్తుంది. బూస్టర్‌ డోసు మాట అటుంచితే, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ లక్ష్యానికి దూరంగా ఉంది. మొదటి డోసు పంపిణీ బాగానే ఉన్నా, రెండో డోసు మూడొంతులు కూడా పూర్తికాలేదు.

Published : 07 Dec 2021 05:32 IST

‘ఒమిక్రాన్‌’ ముప్పు నేపథ్యంలో మేల్కొనాల్సిం


టీకా వేస్తున్న ఆరోగ్య సిబ్బందిే

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే ఒమిక్రాన్‌ రకం కరోనా వ్యాప్తి ఓవైపు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు 40 ఏళ్లు దాటిన వారికి బూస్టర్‌ డోసు అందించేలా కేంద్ర ఆరోగ్య శాఖ ఆలోచన చేస్తుంది. బూస్టర్‌ డోసు మాట అటుంచితే, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ లక్ష్యానికి దూరంగా ఉంది. మొదటి డోసు పంపిణీ బాగానే ఉన్నా, రెండో డోసు మూడొంతులు కూడా పూర్తికాలేదు. నూరు శాతం టీకాల పంపిణీ పూర్తయితే, వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇకనైనా యంత్రాంగం మేల్కోవాల్సిన అవసరం  ఎంతైనా ఉంది.
టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో కొందరు కొవిడ్‌ బారినపడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారు. మరణాల సంఖ్య అతి తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. వైద్యశాలల్లో చేరి వెంటిలేటర్‌ చికిత్స పొందే పరిస్థితులు తలెత్తడం లేదంటున్నారు. ఈ ఏడాది జనవరిలో వైద్య, అంగన్‌వాడీ సిబ్బందికి టీకా వేసే ప్రక్రియ చేపట్టారు. ఫిబ్రవరిలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులకు టీకాలు అందజేశారు. అనంతరం 45 ఏళ్లు పైబడిన వారికి, ఆపై 18 నుంచి 44 వయసున్న వారందరికీ టీకా అందజేసే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది టీకా వేసే కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టారు. గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా గుర్తించి సిబ్బంది వారింటికి వెళ్లి టీకా అందజేస్తున్నారు. లక్ష్య సాధనకు మండల స్థాయి అధికారులు పల్లెల్లో పర్యటించి, దాని ప్రయోజనంపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు అందుబాటులో లేకపోతే పొలాలకు వెళ్లి అందజేస్తున్నారు. మొదటి, రెండో విడతల్లో సచివాలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేశారు. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో టీకా అందజేసే ప్రక్రియను పూర్తిచేయాలని కేంద్రం సూచించింది. ఇప్పటి వరకు టీకా తీసుకోనివారికి రెండు డోసులు పంపిణీ వేగవంతం చేయాలని సిఫార్సు చేసింది. 

ప్రతిఒక్కరికి రెండు డోసులు తప్పనిసరి
కొవిడ్‌ వైరస్‌ బారినపడకుండా ప్రభుత్వం ఉచితంగా టీకా అందజేస్తోంది. మూడో దశ ముప్పు పొంచి ఉన్నందున ప్రతిఒక్కరూ టీకా రెండు డోసులు వేయించుకోవాలి. ఎలాంటి అపోహలకు తావు లేకుండా అందరూ వ్యాక్సినేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి. అన్ని సచివాలయాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయించుకునే అవకాశం ఉంది. 
- యాస్మిన్, డీఎంహెచ్‌వో, గుంటూరు  

జాప్యానికి కారణాలు ఎన్నో..
* గ్రామాల్లో ప్రజలకు కొవిడ్‌ టీకాపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
* కొంతమంది ముందుకొచ్చినా సమయానికి టీకా కొరత ఉండటం, మరికొందరు టీకా తీసుకున్నా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు కాకపోవడం. 
* సచివాలయం, వైద్య సిబ్బంది మధ్య సమన్వయ లోపంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది.
* గ్రామాల్లో టీకా వేసే సమయంలో చాలామంది కూలీలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో వేయించుకోలేని పరిస్థితి. 
* టీకా తీసుకున్న అతికొద్దిమందిలో ఒంటి నొప్పులు, జ్వరం బారినపడటం ఇతరత్రా సమస్యలు ఎదురవడంతో మరికొంê]మంది వెనుకంజ వేస్తున్నారు.  
* ముఖ్యంగా యువత టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడం కూడా లక్ష్య చేదనలో వెనుకబాటుకు కారణమని వైద్య సిబ్బంది చెబుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని