
పాఠశాల అభివృద్ధిని ఆర్జేడీకి వివరిస్తున్న దాత రామిరెడ్డి
నాదెండ్ల, న్యూస్‌టుడే: నాదెండ్ల మండలంలోని పలు విద్యాలయాలను విద్యాశాఖ ఆర్జేడీ బుధవారం సందర్శించారు. చిరుమామిళ్ల, ఏపీ ఆదర్శ పాఠశాలను సందర్శించి అక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ఉపయోగించే విధానాన్ని విద్యార్థులతో పరిశీలించారు. వసతి గృహాన్ని సందర్శించారు. నడికట్టు రామిరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. దాత నడికట్టు రామిరెడ్డితో పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. ఎండుగుంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను సందర్శించి నలుగురు ఉపాధ్యాయులతో పాఠ్యాంశ బోధన తప్పనిసరిగా చేయాలని సూచించారు. నాదెండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.