logo

‘ఓటీఎస్‌ లక్ష్యం చేరకుంటే వేతనాలు నిలిపేస్తాం’

ఒన్‌టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)పై నిర్ధేశిత లక్ష్యాలను లబ్ధిదారుల నుంచి పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులు, సిబ్బంది వేతనాలు నిలిపివేస్తామని మాచర్ల ప్రత్యేకాధికారి, ఎస్‌ఎస్‌ఏ పీవో వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. బుధవారం స్థానిక మానుకొండ

Published : 09 Dec 2021 00:51 IST

గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎస్‌ఏ పీవో వెంకటసుబ్బయ్య, ఛైర్మన్‌ తురకా కిశోర్‌

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: ఒన్‌టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)పై నిర్ధేశిత లక్ష్యాలను లబ్ధిదారుల నుంచి పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులు, సిబ్బంది వేతనాలు నిలిపివేస్తామని మాచర్ల ప్రత్యేకాధికారి, ఎస్‌ఎస్‌ఏ పీవో వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. బుధవారం స్థానిక మానుకొండ కల్యాణ మండపంలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో ఓటీఎస్‌ పథకంపై అవగాహన సభ నిర్వహించారు. ఆయా గ్రామాలు, వార్డుల్లో లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో పురపాలక సంఘ ఛైర్మన్‌ తురకా కిశోర్‌, వైస్‌ ఛైర్మన్‌ పోలూరి నరసింహరావు, జడ్పీటీసీ సభ్యుడు మల్లుస్వామి, కమిషనర్‌ గిరికుమార్‌, తహశీల్దారు కేశవనారాయణ, ఎంపీడీవో సురేష్‌విజయ్‌కుమార్‌, గృహనిర్మాణ డీఈ బుజ్జినాయక్‌, ఎంఈవో నాగయ్య, వైకాపా నాయకులు శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని