logo

విద్యుత్తు విజిలెన్స్‌ అధికారుల దాడులు

జిల్లా విద్యుత్తు విజిలెన్స్‌ అధికారులు దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విస్తృత దాడులు నిర్వహించారు. నడికూడి, నారాయణపురంలోని ఇళ్లు, వ్యాపార సంస్థల్లో 3,679 విద్యుత్తు మీటర్లను

Published : 09 Dec 2021 00:51 IST

దాచేపల్లి : జిల్లా విద్యుత్తు విజిలెన్స్‌ అధికారులు దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విస్తృత దాడులు నిర్వహించారు. నడికూడి, నారాయణపురంలోని ఇళ్లు, వ్యాపార సంస్థల్లో 3,679 విద్యుత్తు మీటర్లను తనిఖీ చేశారు. అందులో వివిధ రకాల అక్రమ కనెక్షన్లను గుర్తించి 107 మందిపై కేసులు నమోదు చేశారు. రూ.2.64లక్షల అపరాధ రుసుం వేశారు. 44మంది అధికారులు, 132 మంది సిబ్బంది 44 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేసినట్లు ఏఈ రామాపురం ఏడుకొండలు చెప్పారు.  ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యుత్తు చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని