logo

బలి కోరిన ఆధిపత్య పోరు

రాజుపాలెం మండలం పెదనెమలిపురిలో పాతకక్షలు పురివిప్పాయి. పొలం నుంచి ఇంటికొస్తుండగా మాజీ సర్పంచి కొర్రకూటి శ్రీనివాసరావు(47)ను ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల

Published : 09 Dec 2021 00:51 IST

ప్రత్యర్థుల చేతిలో మాజీ సర్పంచి దారుణహత్య

శ్రీనివాసరావు (పాతచిత్రం)

రాజుపాలెం, న్యూస్‌టుడే: రాజుపాలెం మండలం పెదనెమలిపురిలో పాతకక్షలు పురివిప్పాయి. పొలం నుంచి ఇంటికొస్తుండగా మాజీ సర్పంచి కొర్రకూటి శ్రీనివాసరావు(47)ను ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు ఉంది. ఈ క్రమంలో బుధవారం పొలం నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న శ్రీనివాసరావును పోలేరమ్మ ఆలయం వద్ద కుర్రా వీరనారాయణ అడ్డగించాడు. దుర్భాషలాడుతూ అప్పటికే తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో తల, శరీరంపై విచక్షణా రహితంగా మోదగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి చేరుకొని శ్రీనివాసరావును పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసరావు 2006 నుంచి 11 వరకు సర్పంచిగా పనిచేశారు. జిల్లా కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ సభ్యులుగానూ వ్యవహరించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు భార్య వెంకాయమ్మ సర్పంచి. సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని