logo
Published : 09 Dec 2021 00:51 IST

అక్రమ సంబంధం.. చేసింది అనర్థం

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ శోభన్‌బాబు, వెనుక నిందితులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఇతరులతో సంబంధానికి అడ్డొస్తున్నాడని సహజీవనం చేస్తున్న వ్యక్తిని మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన మహిళ ఉదంతమిది. పట్టణ పోలీసు స్టేషన్‌లో బుధవారం సీఐ యు.శోభన్‌బాబు కేసు వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. కృష్ణా జిల్లా వీరులపాడుకు చెందిన నాగమల్లేశ్వరికి గురజాల మండలంలోని అంబాపురానికి చెందిన వ్యక్తితో విహహమైంది. అనారోగ్యంతో ఆమె భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందగా, సత్తెనపల్లిలో ఉన్న బంధువుల వద్దకు వచ్చి, ఇక్కడే ఇళ్లల్లో, హోటళ్లలో పనిచేస్తూ జీవనం పొందుతోంది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన చాంద్‌బాష (43) భార్యాపిల్లల్ని వదిలిపెట్టి లారీల్లో పనిచేస్తూ ఊళ్ల వెంట తిరుగుతుంటాడు. మొదటి లాక్‌డౌన్‌లో సత్తెనపల్లి వచ్చిన అతను ఉపాధి కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న హోటల్‌లో పనికి చేరాడు. అదే హోటల్‌లో నాగమల్లేశ్వరి పని చేసేది వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మద్యం తాగి కొట్టడమే కాకుండా నాగమల్లేశ్వరి వివాహేతర సంబంధాల్ని చాంద్‌బాషా ప్రశ్నించేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక వదిలించుకోవాలని ఆమె ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో ఆమె బాషాను హతమార్చాలని నిర్ణయించుకుని తనతో ఎప్పటినుంచో సంబంధం పెట్టుకున్న రెంటచింతలకు చెందిన అన్నపురెడ్డి అమరయ్య, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన తన్నీరు సుబ్బారావు సహకారాన్ని కోరింది. వారిద్దరూ అందుకు సిద్ధమయ్యారు. ఈనెల 3న రాత్రి రైల్వేస్టేషన్‌ రోడ్డులోని స్టేడియం మైదానంలోకి మద్యం తాగుదామని బాషాను ఆ ముగ్గురూ తీసుకెళ్లారు. అతిగా మద్యం తాగించాక గొంతు నొక్కి.. ఛాతిపై చేతులతో గుద్ది హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక పరారయ్యారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై ఎ.రఘుపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని