logo

ధాన్యం కొన్న 21 రోజుల్లో చెల్లింపులు

రబీలో వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఉప సభాపతి కోన రఘుపతి సూచించారు. బాపట్ల మార్కెట్‌ యార్డులో జీడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఆర్‌బీకే కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా

Published : 09 Dec 2021 00:51 IST

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఉప సభాపతి రఘుపతి,

జేడీఏ విజయభారతి, జీడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ భాగ్యలక్ష్మి

బాపట్ల, న్యూస్‌టుడే : రబీలో వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని ఉప సభాపతి కోన రఘుపతి సూచించారు. బాపట్ల మార్కెట్‌ యార్డులో జీడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఆర్‌బీకే కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఉప సభాపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో ఆ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు విపరీతంగా వచ్చి కొనుగోలు సంక్షోభం తలెత్తిందని, దీని ప్రభావం పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌పైన పడిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగి రికార్డు స్థాయిలో దిగుబడులు రావటంతో కొనుగోలు సమస్య వస్తోందని, ధాన్యం, బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా కేంద్ర ప్రోత్సాహకాలకు ఇస్తే వ్యాపారులు పెద్దఎత్తున కొంటారని చెప్పారు. రబీ సీజన్‌లో జొన్న, మొక్కజొన్న, అపరాలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో 734 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొంటున్నట్లు తెలిపారు. కనీస మద్దతు ధర కింద క్వింటా ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1960, సాధారణ రకం ధాన్యానికి రూ.1940 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుందని వివరించారు. సబ్‌ కలెక్టర్‌ నిధీ మీనా, జేడీఏ విజయభారతి, జీడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ యార్లగడ్డ భాగ్యలక్ష్మి, పౌర సరఫరాల డీఎం శివరామప్రసాద్‌, డీఎస్‌వో పద్మశ్రీ, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, జడ్పీటీసీ సభ్యురాలు పిన్నిబోయిన ఎస్తేరురాణి, బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్‌ ఛైర్మన్‌ ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, ఏడీఏ లక్ష్మి, రైస్‌ మిల్లర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు ఊరా భాస్కరరావు, బాపట్ల అధ్యక్షుడు బొమ్మిశెట్టి వెంకటరత్నగుప్తా, ప్రధాన కార్యదర్శి కోళ్లపూడి శివరామప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని