logo

పొదుపు ఖాతాలు నిండుతున్నాయ్‌...

నెలకు రూ.50వేల వేతనం వస్తోంది. నలుగురు సభ్యులున్న కుటుంబంలో గతంలో నెలవారీగా ఖర్చులు పోనూ మిగిలే సొమ్మును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేవాడిని. ఖాతాలో ఎప్పుడూ రూ.20వేలు ఉంటే అవసరాలకు సరిపోయేది. కరోనా తర్వాత ఎప్పుడు

Published : 09 Dec 2021 00:51 IST

కరోనా కాలం మార్చిన ఆలోచన ధోరణి

నెలకు రూ.50వేల వేతనం వస్తోంది. నలుగురు సభ్యులున్న కుటుంబంలో గతంలో నెలవారీగా ఖర్చులు పోనూ మిగిలే సొమ్మును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేవాడిని. ఖాతాలో ఎప్పుడూ రూ.20వేలు ఉంటే అవసరాలకు సరిపోయేది. కరోనా తర్వాత ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని బ్యాంకు ఖాతాలో రూ.లక్ష నిల్వచేసుకున్నాను. ఈ సొమ్మును ఇతర అవసరాలకు వాడుకోకుండా జాగ్రత్త తీసుకుంటున్నాను. ఆరోగ్యం కోసం అత్యవసరమైతే వాడుకునేలా ఈ ఏర్పాటు చేసుకున్నాను. - సురేష్‌, గుంటూరు

ఈనాడు, అమరావతి

జిల్లాలో 2020 నుంచి ప్రజల ఆర్థిక ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. కరోనాకు మందు....తర్వాత బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే పొదుపు చేసే మొత్తం గణనీయంగా పెరిగింది. కరోనా సృష్టించిన విపత్తుతో ఎప్పుడు ఏఅవసరం వస్తుందో తెలియని పరిస్థితుల్లో పొదుపు ఖాతాలో సొమ్ము నిల్వచేయడానికి ప్రత్యేకదృష్టి సారిస్తున్నారు. కరోనా ఇంకా సమసిపోని పరిస్థితిలో వెంటనే నగదు కావాలంటే ఇబ్బందిపడకూడదని భావన. బంగారు, ఆస్తుల డాక్యుమెంట్లు వంటివి కూడా అందుబాటులో ఉంచుకుంటున్నారు. రెండున్నరేళ్ల వ్యవధిలో జిల్లాలో రూ.10వేల కోట్లపైగా డిపాజిట్లు పెరగడం గమనార్హం.

ముందస్తు జాగ్రత్తకే మొగ్గు: ఇప్పుడిప్పుడే కరోనా నుంచి అన్ని రంగాలు కోలుకుంటున్న తరుణంలో మూడోవేవ్‌ ముప్పు పొంచి ఉందన్న ప్రచారంతో అందరూ అప్రమత్తమయ్యారు. అవసరాలు మాత్రమే తీర్చుకుంటూ సౌకర్యాలు, విలాసాలు, ఇతరత్రా వాయిదా వేసుకుంటున్నారు. ముందుజాగ్రత్తగా ఖాతాలో నిర్ణీత మొత్తం సమకూర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

నెలకు రూ.30వేల ఆదాయం వస్తోంది. మాది చిన్న దుకాణం. వ్యాపార లావాదేవీలకు వాడుకునే సొమ్ము కాకుండా పొదుపుఖాతాలో రూ.50వేలు నిల్వచేశా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పొదుపు ఖాతాలో రూ.50వేలు తగ్గకుండా చూసుకుంటున్నా. అత్యవసరాలకు ఈ సొమ్ము పనికొస్తుంది. - గణేష్‌, గుంటూరు

పెరిగిన ఆసక్తి

ఇతర అసెట్‌ క్లాసెస్‌ కన్నా బ్యాంకుఖాతాలో సొమ్ము ఉన్నట్లయితే నిమిషాల్లో నగదు చేతికి వస్తుంది. అర్ధరాత్రి అవసరమైనా తీసుకోవడానికి వెసులుబాటు ఉండటం, డిజిటల్‌ సేవలు అందుబాటులో రావడంతో నిర్ణీత మొత్తం ఉంచుకోవడం మొదలుపెట్టారు. కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో మార్పు స్పష్టంగా కనిపించింది. - ఈదర రాంబాబు, లీడ్‌బ్యాంకు మేనేజరు, గుంటూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని