logo

చురుగ్గా ఆలయ నిర్మాణ పనులు

పట్టణంలోని కళామందిర్‌ సెంటర్‌ వద్ద ఉన్న శ్రీగంగా బాలా త్రిపుర సుందరి సమేత శ్రీనాగేశ్వరస్వామి దేవస్థానానికి (శివాలయం) 250 ఏళ్ల చరిత్ర ఉంది. సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్న ఓ పూజారికి స్వామి కలలో వచ్చి ఇక్కడ ఆలయాన్ని

Published : 15 Jan 2022 00:57 IST


నిర్మాణంలో శివాలయం

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : పట్టణంలోని కళామందిర్‌ సెంటర్‌ వద్ద ఉన్న శ్రీగంగా బాలా త్రిపుర సుందరి సమేత శ్రీనాగేశ్వరస్వామి దేవస్థానానికి (శివాలయం) 250 ఏళ్ల చరిత్ర ఉంది. సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్న ఓ పూజారికి స్వామి కలలో వచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని చెప్పడంతో కట్టినట్లుగా చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి 2018వ సంవత్సరం వరకు ఇక్కడ శివాలయం ఒక వెలుగు వెలిగింది. నిత్యం వందలాదిమంది భక్తులు ఆలయంలో పూజలు నిర్వహించేవారు. పండగల సమయంలో కిక్కిరిసిపోయేది. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని 2018లో అప్పటి ప్రభుత్వం పునర్నిర్మించాలని కలాన్యాసం చేశారు. దీని కోసం దాతల సహకారంతో పాటు సీజేఎఫ్‌ ఫండ్‌ రూ.53 లక్షలతో నిర్మాణానికి రూ.1.30 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి నిర్మాణం సాగుతూనే ఉంది. ఇటీవల పనులు కాస్తంత వేగవంతమయ్యాయి. ప్రధాన ఆలయంతో పాటు అమ్మవారి ఆలయం, వినాయకుని గుడి, ధ్వజస్తంభం పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ ఏడాదిలో ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఈవో సాయిబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని