logo

నగరంలో సంక్రాంతి సందడి

ఉభయ రాష్ట్రాల తెలుగు వారు ఏటా తమ కుటుంబ సభ్యులతో అత్యంత సంబరంగా చేసుకునే సంక్రాంతి పర్వదినం రానే వచ్చింది. మూడు రోజులపాటు చిన్నా, పెద్ద అని భేదాలు లేకుండా సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ అట్టహాసంగా సంక్రాంతి పండగను నిర్వహించుకుంటారు.

Published : 15 Jan 2022 00:57 IST

వినియోగదారులను ఆకర్షిస్తున్న ఆఫర్లు

గుంటూరు సిటీ: ఉభయ రాష్ట్రాల తెలుగు వారు ఏటా తమ కుటుంబ సభ్యులతో అత్యంత సంబరంగా చేసుకునే సంక్రాంతి పర్వదినం రానే వచ్చింది. మూడు రోజులపాటు చిన్నా, పెద్ద అని భేదాలు లేకుండా సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ అట్టహాసంగా సంక్రాంతి పండగను నిర్వహించుకుంటారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పండగ సందడి కనిపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, చదువులు వంటి ఇతరత్రా కారణాలతో నిత్యం ఒత్తిళ్లతో ఉండేవారు ఈ పండగ రోజుల్లో తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములవుతారు. ఈ నేపథ్యంలో నగరంలోని వస్త్ర, ఫర్నిచర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలు తమ వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నాయి. అన్ని వర్గాల వారి అభిరుచులకు అనుగుణంగా ఆయా ఉత్పత్తులపై ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించాయి. పండగ పర్వదినాలను పురస్కరించుకుని మరికొన్ని రోజుల పాటు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంచనున్నట్లు పలు వ్యాపార సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. పిండివంటలు, గృహోపకరణాలను సరసమైన ధరలకే విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావాసులు గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలోని పలు వస్త్ర, ఫర్నిచర్‌ దుకాణాలను సందర్శించడంతో నగర వ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని