logo

బరువెత్తి.. బహుమతి పట్టి

మండలంలోని వేములూరిపాడులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తొమ్మిదో జాతీయ స్థాయి 102 కేజీల గుండురాయి ఎత్తు పోటీలు అలరించాయి. ఐదు నిమిషాల సమయంలో నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన మద్దా వీరాంజనేయులు

Published : 15 Jan 2022 06:40 IST


ప్రథమ స్థానంలో నిలిచిన మద్దా వీరాంజనేయులు

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని వేములూరిపాడులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన తొమ్మిదో జాతీయ స్థాయి 102 కేజీల గుండురాయి ఎత్తు పోటీలు అలరించాయి. ఐదు నిమిషాల సమయంలో నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన మద్దా వీరాంజనేయులు గుండు రాయిని 30 సార్లు పైకి ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచారు. మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన శోభన్‌ 28 సార్లు, ఎన్‌.రామాంజనేయులు 27 సార్లు ఎత్తి ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన భీమనాథుని అంజమ్మ, వెంకటసుబ్బయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు చలపతిరావు విజేతకు రూ.5 వేలు బహుమతిగా ఇచ్చారు. సునీల్‌కుమార్‌ రూ.3 వేలు, ఫిరంగిపురం వాసి రమేష్‌ రూ.1,116లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేశారు. గ్రామానికి చెందిన షేక్‌ అఫీజ్‌ గుండురాయిని పది సార్లు ఎత్తి ప్రత్యేక బహుమతి కింద రూ.1000లు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని