logo

కత్తులు కట్టి.. బరిలో దించి!

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తీరంలో పందెం రాయుళ్లు కోళ్ల పందేలు నిర్వహించారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలో దించారు. పందెం కోళ్లు రూ.లక్షల ధర పలికాయి. రేపల్లె మండలం పేటేరు గ్రామ శివారులో శుక్రవారం పందేలు జోరుగా సాగాయి. రూ.ఐదు

Published : 15 Jan 2022 00:57 IST

ప్రకటనలకే పరిమితమైన పోలీసులు


పందెంలో కోళ్లు

బాపట్ల, రేపల్లె, న్యూస్‌టుడే : పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తీరంలో పందెం రాయుళ్లు కోళ్ల పందేలు నిర్వహించారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలో దించారు. పందెం కోళ్లు రూ.లక్షల ధర పలికాయి. రేపల్లె మండలం పేటేరు గ్రామ శివారులో శుక్రవారం పందేలు జోరుగా సాగాయి. రూ.ఐదు నుంచి ఇరవై ఐదు వేల వరకు కాశారు. పోలీసులు ఆ చుట్టుపక్కలకే వెళ్లలేదు. రేపల్లె పట్టణ శివారు పెనుమూడిలో తొలుత బరులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు విషయం బహిరంగం కావటంతో నిజాంపట్నం మండలంలో శని, ఆదివారాలు కోడిపందేలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పందెం కోడి రూ.75 వేల నుంచి రూ.లక్షన్నర వరకు పలికింది. పెంపకందారులు పెద్ద సంఖ్యలో కోళ్లు పెంచి విక్రయించటం ద్వారా భారీగా లాభపడ్డారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల వరకు వర్షం కురవటంతో పందేలు ప్రారంభం కాలేదు. ఆ తరువాత వాన లేకపోవటంతో టెంట్లు వేసి పందేలు వేశారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లోను గుట్టుచప్పుడు కాకుండా బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. కొందరు భారీ స్థాయిలో కోడి పందేలు ఆడేందుకు పలువురు కార్లలో భీమవరం, గుడివాడ, కలిదిండి, భీమడోలు, చింతలపూడి తరలివెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని