logo

‘రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది’

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల మండలం పాండురంగాపురం, కంకటపాలెం, నరసాయపాలెంలో భారీవర్షాలకు నీట మునిగిన వరి పనులు, నేలవాలిన పంటను శుక్రవారం సాయంత్రం

Published : 15 Jan 2022 00:57 IST


వాన నీటిలో తడిసిన వరి పనలు పరిశీలిస్తున్న ఉప సభాపతి రఘుపతి

బాపట్ల, న్యూస్‌టుడే : అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల మండలం పాండురంగాపురం, కంకటపాలెం, నరసాయపాలెంలో భారీవర్షాలకు నీట మునిగిన వరి పనులు, నేలవాలిన పంటను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. పంట చేతికి అంది వచ్చే దశలో వర్షాలు కురిసి నష్టం చేకూర్చడం బాధాకరమన్నారు. తడిసి రంగుమారిన ధాన్యం కొనేలా ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. అన్నదాతలకు సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలుస్తారని పేర్కొన్నారు. రైతులు అధైర్యపడవద్దన్నారు. పంట నష్ట వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించి పరిహారం త్వరగా అందేలా చూస్తామన్నారు. ఏఎంసీ ఛైర్మన్‌ గవిని కృష్ణమూర్తి, ఏడీఏ లక్ష్మి, ఏవో శారద తదితరులు నీట మునిగిన పంటలు పరిశీలించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని