logo

తప్పిన ప్రాణాపాయం

బాపట్లలోని రాజీవ్‌ నగర్‌లో కుందేటి శ్రీను ఇంటిపై పక్కనే ఉన్న శుద్ధజల కేంద్రం ప్రహరీ కూలింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి నానిన గోడ ఒక్కసారిగా కూలింది. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీను తన కుటుంబ

Published : 15 Jan 2022 00:57 IST

బాపట్ల పట్టణం, న్యూస్‌టుడే : బాపట్లలోని రాజీవ్‌ నగర్‌లో కుందేటి శ్రీను ఇంటిపై పక్కనే ఉన్న శుద్ధజల కేంద్రం ప్రహరీ కూలింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి నానిన గోడ ఒక్కసారిగా కూలింది. ఇంట్లో నిద్రిస్తున్న శ్రీను తన కుటుంబ సభ్యులను తీసుకొని బయటకు పరుగులు తీశాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో సామగ్రి పూర్తిగా దెబ్బతింది. పేదల నివాస స్థలం ఆక్రమించుకొని, అనుమతి లేకుండా శుద్ధజల కేంద్రం నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరుతూ వైకాపా నేత చల్లా రామయ్య, స్థానికులు ధర్నా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు