logo

వణికిస్తున్న వాన

అకాల వర్షాలు రైతన్నను వణికిస్తున్నాయి.   ఇటీవల కోత కోసిన పంటలు పొలాల్లోనే నీటమునిగాయి.  పొలంలో నిలిచిన నీరు బయటకు పంపే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. పలుచోట్ల మిరప పంటలోనూ నీరు నిలిచింది. వరి ఓదెలు తడిసి ముద్దయ్యాయి.

Published : 15 Jan 2022 00:57 IST


భట్టిప్రోలులో  వరికుప్ప చుట్టూ నిలిచిన వర్షపునీరు

గుంటూరు  : అకాల వర్షాలు రైతన్నను వణికిస్తున్నాయి.   ఇటీవల కోత కోసిన పంటలు పొలాల్లోనే నీటమునిగాయి.  పొలంలో నిలిచిన నీరు బయటకు పంపే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. పలుచోట్ల మిరప పంటలోనూ నీరు నిలిచింది. వరి ఓదెలు తడిసి ముద్దయ్యాయి. మినుము పంట కోత కోసిన రైతన్నలు గింజలు పాడవుతాయని ఆందోళన చెందుతున్నారు. నూర్పిడి చేసిన ధాన్యం, కోతలు కోసిన మిరప కాయలను ఆరబెట్టుకున్న రైతులు సైతం అకాల వర్షానికి తడిసిపోవడంతో కన్నీరు పెడుతున్నారు.  
 23.8 మి.మీ వర్షపాతం: జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 23.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చుండూరు 72.4, దుగ్గిరాల 68.2, బాపట్ల 65.8, పొన్నూరు 64.8, కర్లపాలెం 56.2, కొల్లూరు 51.8, పెదకాకాని 49.4, తెనాలి 48.8, తాడేపల్లి 46.4, మంగళగిరి 45.4, కాకుమాను 44, వట్టిచెరుకూరు 43.6, చేబ్రోలు 43.2, ప్రత్తిపాడు 42.2, తుళ్లూరు 42.2, చిలకలూరిపేట 38.6, వెల్దుర్తి 36.6, భట్టిప్రోలు 36.4, గుంటూరు 33, వేమూరు 32.2, తాడికొండ 30.4, రేపల్లె 30.2, పెదనందిపాడు 28.2, దుర్గి 26, పెదకూరపాడు 22.6, పిట్టలవానిపాలెం 21, ఫిరంగిపురం 20.8 మి.మీ వర్షం కురిసింది. చెరుకుపల్లి 18.4, నగరం 17.4,  నాదెండ్ల 15.4, మాచర్ల 15.2, నిజాంపట్నం 15.2, కొల్లిపర 12.8, కారంపూడి 12.2, వినుకొండ 11.6, యడ్లపాడు 8, అమరావతి 7.6, పిడుగురాళ్ల 5.4, శావల్యాపురం 5.2, రెంటచింతల 4.8, బెల్లంకొండ 4.6, గురజాల 4.2, నూజెండ్ల 4.2, దాచేపల్లి 3.2, సత్తెనపల్లి 3.2, బొల్లాపల్లి 2.8, మాచవరం 2.8,  నకరికల్లు 2, నరసరావుపేట 1.2, రొంపిచర్ల 1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని