logo

తప్పిన పెనుప్రమాదం

స్థానికులు, విద్యుత్తు అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని జియో టవర్‌ రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్తు స్తంభంపై షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విద్యుత్తు

Published : 15 Jan 2022 00:57 IST

నగరం, న్యూస్‌టుడే : స్థానికులు, విద్యుత్తు అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని జియో టవర్‌ రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్తు స్తంభంపై షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విద్యుత్తు సరఫరా చేసే తీగ తెగి కిందికి జారింది. గమనించిన స్థానికుడు మురళి వెంటనే విద్యుత్తు శాఖాధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు సరఫరా నిలిపివేయడంతో పండగనాడు పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లైన్‌మేన్‌ మోహనరావు, సిబ్బంది ఏసుపాదం, బాబు సకాలంలో స్పందించి మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని