logo

జాతీయస్థాయి కబడ్డీ పోటీల విజేత హరియాణ

గ్రామీణ క్రీడ కబడ్డీని ముప్పాళ్ల గ్రామస్థులు 30 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఈపూరు మండలం ముప్పాళ్లలో ఈనెల 12 నుంచి జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 53 జట్లు పోటీల్లో పాల్గొనగా

Published : 17 Jan 2022 02:33 IST


ప్రథమ బహుమతి సాధించిన జట్టు సభ్యులతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

ఈపూరు, న్యూస్‌టుడే: గ్రామీణ క్రీడ కబడ్డీని ముప్పాళ్ల గ్రామస్థులు 30 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఈపూరు మండలం ముప్పాళ్లలో ఈనెల 12 నుంచి జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 53 జట్లు పోటీల్లో పాల్గొనగా హరియాణ జట్టు 22 పాయింట్లు సాధించి ప్రథమ బహుమతి 1.5లక్షలను కైవసం చేసుకుంది. కర్ణాటక వెంకట యువసేన జట్టు ద్వితీయ బహుమతి, పంజాబ్‌ జట్టు మూడో బహుమతి, కర్ణాటక బీఎంటీసీ జట్టు నాలుగో బహుమతి, ముప్పాళ్ల సీనియర్స్‌ జట్టు ఐదో బహుమతి, దిల్లీ జట్టు ఆరో బహుమతి, బొగ్గరం జట్టు ఏడో బహుమతి, వైజాగ్‌ సీనియర్స్‌ జట్టు ఎనిమిదో బహుమతి, ముప్పాళ్ల జూనియర్స్‌ జట్టు తొమ్మిదో బహుమతి, వైజాగ్‌ జూనియర్స్‌ జట్టు పదో బహుమతి, కర్నూలు జట్టు పదకొండవ, కర్ణాటక బుల్స్‌ జట్టు పన్నెండవ బహుమతి సాధించాయి. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల నిర్వహణ కమిటీ సమన్వయకర్తలు తల్లపనేని రామారావు, తల్లపనేని కోటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు తుర్లపాటి చౌడయ్య, ఈపూరు సొసైటీ అధ్యక్షుడు బొల్లా బుజ్జి, బుచ్చయ్య, తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని