logo

రెండు కిలోల వెండి, 30 సవర్ల బంగారం చోరీ

పండక్కి ఊరెళ్లటంతో ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి చోరీ చేశారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న మొవ్వా సుబ్బారావు పండరీపురం మొదటి లైన్‌లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు. 14న భార్యతో కలసి స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి 15 సాయంత్రం 6 గంటలకు

Published : 17 Jan 2022 02:33 IST


చెల్లాచెదురుగా పడేసిన బీరువాలో నుంచి తీసిన వస్తువులు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : పండక్కి ఊరెళ్లటంతో ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి చోరీ చేశారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న మొవ్వా సుబ్బారావు పండరీపురం మొదటి లైన్‌లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు. 14న భార్యతో కలసి స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి 15 సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఉత్తర ద్వారం తలుపు పగులగొట్టి ఉండటంతో ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అర్బన్‌ ఎస్సై ఫిరోజ్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బీరువాలోని వస్తువులు మంచంపై చెల్లాచెదురుగా ఉన్నాయి. క్లూస్‌టీం వచ్చి వేలిముద్రలు నమోదు చేశారు. అర్బన్‌ సీఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ బాధితురాలు సుభాషిణి ఫిర్యాదు మేరకు సుమారు 30 సవర్లకు పైగా బంగారం, రెండు కిలోల వెండి చోరీకి గురైనట్లు కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని