logo

ఇక 24 గంటలూ.. త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా

అయిదు వేల జనాభా పైబడిన గ్రామపంచాయితీల్లో 24 గంటల పాటు త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీడీసీఎల్‌ ఈఈ ఎస్‌.శ్రీనివాసరావు చెప్పారు. గురువారం నకరికల్లు విద్యుత్తు ఉప కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఇందుకుగాను రూ.14 కోట్ల వ్యయంతో కొత్తగా

Published : 21 Jan 2022 05:47 IST

నకరికల్లు, న్యూస్‌టుడే: అయిదు వేల జనాభా పైబడిన గ్రామపంచాయితీల్లో 24 గంటల పాటు త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీడీసీఎల్‌ ఈఈ ఎస్‌.శ్రీనివాసరావు చెప్పారు. గురువారం నకరికల్లు విద్యుత్తు ఉప కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఇందుకుగాను రూ.14 కోట్ల వ్యయంతో కొత్తగా 129 కిలోమీటర్ల మేర త్రీఫేజ్‌ విద్యుత్తు లైను నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇవిగాక ఇప్పటివరకు సింగిల్‌ ఫేజ్‌గా ఉన్న 68 కిలోమీటర్ల విద్యుత్తు లైనును త్రీఫేజ్‌గా మార్చనున్నట్లు ఆయన వివరించారు. తద్వారా ఆయా గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్తు సరఫరాతోపాటు లోవోల్టేజీ సమస్యను అధిగమించొచ్చన్నారు. డివిజన్‌ పరిధిలోని రావిపాడు, సత్తెనపల్లి పరిధిలో కొమెరపూడి, వినుకొండ సెక్షన్‌లో వెల్లటూరు, వేల్పూరు గ్రామాల్లో రూ.14 కోట్ల వ్యయంతో విద్యుత్తు ఉపకేంద్రాలను నిర్మించనున్నట్లు వివరించారు. నెలరోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. త్రిఫేజ్‌ సరఫరా లైను నిర్మాణంలో భాగంగా డివిజన్‌లో 100 కేవీఏ నియంత్రికలు 125, 25 కేవీఏ నియంత్రికలు 21 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి పగలు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఇబ్బందులు లేకుండా 8,394 నియంత్రికలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వినుకొండ పరిధిలోని నక్సల్‌ ప్రభావిత ఎనిమిది గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. డీఈఈ కోటేశ్వరరావు, ఏఈఈలు డానియేలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని