logo

ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండండి

యువత ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని సీడాప్‌ ఛైర్మన్‌ సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ- సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న డీడీయూజీకేవై పథకం అమలును పరిశీలించేందుకు కోటప్పకొండలోని శిక్షణ కేంద్రాన్ని గురువారం

Published : 21 Jan 2022 05:47 IST

సీడాప్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి


శిక్షణ పొందుతున్న నిరుద్యోగులతో మాట్లాడుతున్న శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి

గ్రామీణ నరసరావుపేట, న్యూస్‌టుడే : యువత ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని సీడాప్‌ ఛైర్మన్‌ సాది శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ- సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న డీడీయూజీకేవై పథకం అమలును పరిశీలించేందుకు కోటప్పకొండలోని శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని కంప్యూటర్‌ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, ఆంగ్లం, సాఫ్ట్‌ స్కిల్స్‌పై పట్టు సాధించాలని చెప్పారు. జేడీఎం శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం పది శిక్షణ కేంద్రాల్లో 566 మంది శిక్షణ పొందుతున్నట్లు పేర్కొన్నారు. వీరికి వెబ్‌ డెవలపర్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ టెక్నిషన్‌, రిటైల్‌, నర్సింగ్‌, ఎలక్ట్రికల్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జాబ్‌ కో- ఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని