logo

‘జీఎస్టీ రద్దు చేస్తేనే చేనేతకు మనుగడ’

చేనేత వస్త్రాలపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలని కోరుతూ చెరుకుపల్లి మండల చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ గురువారం చెరుకుపల్లిలో చేనేత మార్చ్‌ నిర్వహించింది. అఖిల భారత పద్మశాలీయ సంఘం పిలుపుమేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ

Published : 21 Jan 2022 05:47 IST


చెరుకుపల్లిలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నేత కార్మికులు, నాయకుల నినాదాలు

చెరుకుపల్లి, న్యూస్‌టుడే : చేనేత వస్త్రాలపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలని కోరుతూ చెరుకుపల్లి మండల చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ గురువారం చెరుకుపల్లిలో చేనేత మార్చ్‌ నిర్వహించింది. అఖిల భారత పద్మశాలీయ సంఘం పిలుపుమేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా 2017లో కేంద్రం చేనేతపై జీఎస్టీ విధించి చేనేత రంగాన్ని చావుదెబ్బ తీసిందన్నారు. కార్పొరేట్‌ రంగాలకు కొమ్ముకాస్తూ జీఎస్టీ విధింపు ద్వారా చేనేతను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చేనేత వస్త్రాలు, ముడి సరకులను జీరో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రదర్శన అనంతరం తహశీల్దార్‌ సీహెచ్‌ సుధారాణికి వినతి పత్రం అందించారు. ప్రదర్శనకారులు గాంధీ టోపీలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా గాంధీ విగ్రహానికి, ఐలాండ్‌ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు మరివాడ వెంకటరావు, జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల బాలాజీ, ఆప్కో మాజీ డైరెక్టర్‌ దివి రాంబాబు, సాయి రాజేంద్ర చేనేత సంఘ అధ్యక్షులు దివి శ్రీనివాసరావు, చేనేత నాయకులు కందుల రామమోహనరావు, మాచర్ల వీరబ్రహ్మం, ఓరుగంటి శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని