logo

తుది పరీక్షల్లో మంచి గ్రేడు పాయింట్లు సాధించాలి

పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడు పాయింట్లు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజనం పథకం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) వి.శ్రీనివాస్‌ అన్నారు. యడ్లపాడు మండలం లింగారావుపాలెంలోని జడ్పీ ఉన్నత

Published : 22 Jan 2022 02:12 IST


విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న శ్రీనివాస్‌

యడ్లపాడు, న్యూస్‌టుడే : పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడు పాయింట్లు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజనం పథకం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) వి.శ్రీనివాస్‌ అన్నారు. యడ్లపాడు మండలం లింగారావుపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన పరీక్షలు ఫలితాలు రావటానికి ప్రణాళికబద్దంగా చదువుకోవాలన్నారు. విద్యార్థులతో కలసి మాధ్యాహ్న భోజనం చేశారు. మరుగుదొడ్లను పరిశీలించారు. హెచ్‌ఎం శంకరరాజు ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని