logo

పీఆర్‌సీ జీవోల ఉపసంహరణకు డిమాండ్‌

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన పీఆర్‌సీ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా కోర్టు వద్ద న్యాయశాఖ సిబ్బంది శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను యథాతథంగా కొనసాగించాలని కోరారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని,

Published : 22 Jan 2022 02:12 IST


జిల్లా కోర్టు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయ శాఖ సిబ్బంది

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన పీఆర్‌సీ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా కోర్టు వద్ద న్యాయశాఖ సిబ్బంది శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని, హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను యథాతథంగా కొనసాగించాలని కోరారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయశాఖ సిబ్బంది సంఘం జిల్లా కార్యదర్శి పాలపర్తి శ్రీనివాసరావు, కోశాధికారి సి.హెచ్‌.నవీన్‌కుమార్‌, నాలుగో తరగతి సిబ్బంది రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చంద్రశేఖర్‌, కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని