logo

ప్రత్యేక బృందాలతో తనిఖీలు

జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు యూరియా గరిష్ఠ చిల్లర ధరకు మించి అమ్మడంతోపాటు లింకు ఎరువులు రైతులకు అంటగడుతున్నారన్న విషయమై ‘అడ్డగోలు దోపిడీ’ శీర్షికతో శుక్రవారం ఈనాడులో వచ్చిన కథానానికి కలెక్టర్‌

Published : 22 Jan 2022 02:12 IST

ఈనాడు, గుంటూరు : జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు యూరియా గరిష్ఠ చిల్లర ధరకు మించి అమ్మడంతోపాటు లింకు ఎరువులు రైతులకు అంటగడుతున్నారన్న విషయమై ‘అడ్డగోలు దోపిడీ’ శీర్షికతో శుక్రవారం ఈనాడులో వచ్చిన కథానానికి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ స్పôదించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అధికధరకు అడ్డుకట్ట వేయాలని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయభారతికి సూచించారు. శుక్రవారమే ప్రతి మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీ చేయాలని వ్యవసాయాధికారులను ఆమె ఆదేశించారు. రేపల్లె, పొన్నూరు డివిజన్లలో డీడీఏలను తనిఖీలకు పంపారు. తెనాలి డివిజన్‌లో జేడీఏ విజయభారతి పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. శుక్రవారం యూరియా అమ్మకాలు జరుపుతున్న వంద దుకాణాలను తనిఖీ చేశారు. 8,561 మెట్రిక్‌ టన్నులు రాగా 8 వేల మెట్రిక్‌ టన్నులు విక్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న రూ.3.56 లక్షల విలువైన ఎరువుల అమ్మకాలు నిలుపుదల చేశారు. దాడులు శనివారం కూడా కొనసాగుతాయని జేడీఏ తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని