logo

నియోజకవర్గానికో కొవిడ్‌ కేర్‌ కేంద్రం

జిల్లాలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మూడో దశ వేగంగా విస్తరిస్తున్నందున తొలి దశలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను తక్షణమే ప్రారంభించేందుకు

Published : 22 Jan 2022 02:12 IST

గుంటూరు వైద్యం: జిల్లాలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మూడో దశ వేగంగా విస్తరిస్తున్నందున తొలి దశలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను తక్షణమే ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించారు. వైరస్‌   బాధితులను ఈ కేంద్రాలకు ఉచితంగానే తరలించనున్నారు. డీఎంహెచ్‌వో యాస్మిన్‌ పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి జిల్లా నోడల్‌ అధికారిగా డాక్టర్‌ లక్ష్మానాయక్‌ వ్యవహరించనున్నారు. అవసరమైన వారు 94404 65388లో సంప్రదించవచ్చు. 
 104కి ఫోన్‌ చేస్తే : 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కడ చేస్తున్నారు? కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఏ ఆసుపత్రిలో పడకలు అందుబాటులో ఉన్నాయి తదితర సమాచారం లభిస్తోంది. ఇళ్లలో తగిన సదుపాయాలుండి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ప్రభుత్వమే ఉచితంగా ఔషధాలు, వైద్యుల సలహాలు అందేవిధంగా ఏర్పాట్లు చేశారు. 
అందుబాటులో 3 వేల పడకలు
జిల్లాలో అన్ని కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో 3 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. తొమ్మిది కేంద్రాలను ఇప్పటికే గుర్తించాం. మిగిలిన ఎనిమిది రెండు రోజుల్లో గుర్తిస్తాం. ఇప్పటికే గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మిగిలినవి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపుతాం.  -డాక్టర్‌ లక్ష్మానాయక్, జిల్లా నోడల్‌ అధికారి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని