logo

మట్టి లేకుండా మిద్దెతోట

మట్టి లేకుండానే పంటలు పండించే హైడ్రోఫోనిక్స్‌ విధానం గురించి ఇటీవల వింటున్నాం. ఇదే విధానాన్ని మిద్దెతోటకు ఎందుకు ఉపయోగించకూడదని భావించాడు మంగళగిరికి చెందిన మునాఫ్‌. ఆ దిశగా ప్రయోగాలు చేసి సఫలమయ్యారు. తక్కువ స్థలంలో మట్టితో

Updated : 22 Jan 2022 05:21 IST


కోకోపిట్‌ విధానంలో సాగు చేసిన కూరగాయలు

ఈటీవీ-మంగళగిరి(గుంటూరు) మట్టి లేకుండానే పంటలు పండించే హైడ్రోఫోనిక్స్‌ విధానం గురించి ఇటీవల వింటున్నాం. ఇదే విధానాన్ని మిద్దెతోటకు ఎందుకు ఉపయోగించకూడదని భావించాడు మంగళగిరికి చెందిన మునాఫ్‌. ఆ దిశగా ప్రయోగాలు చేసి సఫలమయ్యారు. తక్కువ స్థలంలో మట్టితో పెంచే మొక్కలకన్నా మంచి దిగుబడులు వస్తున్నట్లు తెలిపారు. శీతల పానీయాల దుకాణం నిర్వహించే మునాఫ్‌కు వ్యవసాయంపై మక్కువ. ఈ క్రమంలోనే హైడ్రోఫోనిక్స్‌ విధానంలో సాగు గురించి తెలుసుకున్నారు. భూమితో సంబంధం లేకుండా పంటలు పండించటం, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించటం వంటి ప్రయోజనాల్ని గుర్తించారు. తానెందుకు ఆ పని చేయకూడదని భావించి నాలుగైదు బకెట్లలో మొక్కలు నాటి ప్రయోగాలు చేశారు. అందులో లోటుపాట్లు తెలుసుకున్నారు. మిద్దెతోటలో అన్ని రకాల మొక్కల్ని హైడ్రోఫోనిక్స్‌ విధానంలో పెంచవచ్చని అర్థమైంది. ప్లాస్టిక్‌ పైపులకు రంద్రాలు చేశారు. అందులో మట్టికి బదులు కోకోపిట్‌తో నింపారు. బొగ్గు, వర్మి కంపోస్ట్‌ను కొంతమేర జతచేశారు. పైపులకు వేసిన రంద్రాల్లోనే మొక్కలు నాటారు. అలాగే మరికొన్ని బకెట్లలోనూ మొక్కలు ఉంచారు. వీటన్నింటినీ డ్రిప్‌ ద్వారా అనుసంధానించి నీరందిస్తున్నారు. తన మిద్దెతోటపైనే అన్ని రకాల కూరగాయల్ని మునాఫ్‌ పండిస్తున్నారు. పూర్తిగా సేంద్రియ విధానంలోనే మిద్దెతోట సాగు చేస్తున్నారు. ఈ విధానం లాభదాయకమని మునాఫ్‌ చెబుతున్నారు.  మట్టి బదులు కోకోపిట్‌ వినియోస్తుండటం వల్ల తక్కువ బరువు ఉంటుందని, భవనంపై పెద్దగా భారం ఉండదన్నారు. ఇంట్లో నివశించేవారికి చల్లని వాతావరణం ఉంటుందన్నారు. ఆరోగ్యవంతమైన మంచి కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయన్నారు.


కొబ్బరిపిట్‌ నింపి మొక్కల సాగు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని