logo

కొవిడ్‌ చికిత్సల పర్యవేక్షణకు నోడల్‌ బృందాలు

జిల్లాలో కొవిడ్‌ నివారణ, చికిత్సల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన నోడల్‌ బృందాలు సమర్థంగా పని చేయాలని జిల్లా సంయుక్త కలెక్టరు రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో కొవిడ్‌-19పై సమావేశం నిర్వహించారు. కరోనా కేసులను

Published : 22 Jan 2022 02:12 IST


మాట్లాడుతున్న జేసీ రాజకుమారి, చిత్రంలో ప్రభావతి, యాస్మిన్, వినాయకం

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ నివారణ, చికిత్సల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన నోడల్‌ బృందాలు సమర్థంగా పని చేయాలని జిల్లా సంయుక్త కలెక్టరు రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో కొవిడ్‌-19పై సమావేశం నిర్వహించారు. కరోనా కేసులను గుర్తించడం, నమూనాల పరీక్షలు, హోం ఐసొలేషన్, ఆస్పత్రుల నిర్వహణకు బృందాలు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి నమూనాలు సేకరించి 24 గంటల్లోపు ప్రయోగశాలకు పంపాలని స్పష్టం చేశారు. తెనాలి, నరసరావుపేటలోని వీర్‌డీఎల్‌ఏ ల్యాబ్‌లను వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చి నమూనా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అధికారులు ఆయా ఆస్పత్రుల్లో పడకల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చూడాలన్నారు. హోం ఐసొలేషన్‌ బృందాలు ప్రతి రోజూ నిర్దేశించిన నమూనాలో డేటాను ఆన్‌లైన్‌లో నవీకరించాలన్నారు.  సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టరు వినాయకం, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, నోడల్‌ బృందాల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని