logo

విద్యాలయాల్లో పంచాయతీ పాలన!

ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి పాలనా పరమైన కార్యాలయాలు ఏర్పాటు చేయొద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇంకా అక్కడక్కడా వాటి ఆనవాళ్లు కనపడుతూనే ఉన్నాయి. ముందుచూపు

Published : 22 Jan 2022 02:12 IST


రవ్వారం పాఠశాల భవనంలో ఉన్న గ్రామ సచివాలయం 

ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి పాలనా పరమైన కార్యాలయాలు ఏర్పాటు చేయొద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇంకా అక్కడక్కడా వాటి ఆనవాళ్లు కనపడుతూనే ఉన్నాయి. ముందుచూపు లేకుండా రూ.లక్షలతో పక్కా భవనాలు నిర్మించారు. నూజండ్ల మండలం రవ్వారం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల గదుల్లో తాత్కాలికంగా గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అందులోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వేరే స్థలంలో కొత్త భవనం నిర్మాణంలో ఉన్నందున అది పూర్తయ్యే వరకు ఇక్కడే కొనసాగుతుందని సిబ్బంది తెలిపారు. అలాగే మాచరవరం మండలం మోర్జంపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రైతు భరోసా కేంద్రానికి కొత్త భవనం నిర్మించారు. నాదెండ్ల మండలం సాతులూరిలోని బండారుపల్లివారిపాలెం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు 93 సెంట్లు ఉంటే అందులో 10 సెంట్ల స్థలంలో గ్రామ సచివాలయం-2 నిర్మించారు. 90శాతం పనులు పూర్తి చేసిన తర్వాత స్థానికులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేయడంతో పనులు ఆపేశారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే చోట పాలనా పరమైన కార్యకలాపాలు నిర్వహించడం తగదన్న న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 
- న్యూస్‌టుడే, వినుకొండ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని