logo

బెంగళూరుకు పోలీసు బృందం

జిల్లాలో కేఎల్‌ వర్సిటీ, వీవీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో జరిగిన కంప్యూటర్ల చోరీ కేసుల్లో కీలకమైన సమాచారం పోలీసులకు లభించింది. కంప్యూటర్ల నుంచి ప్రాసెసర్లు వేరు చేసి వాటిని పట్టుకెళ్లటంలో సిద్ధహస్తుడిగా పేరుగడించిన ఒడిశాకు చెందిన పాతనేరస్థుడొకర్ని ఇటీవల బెంగళూరు పోలీసులు

Published : 23 Jan 2022 01:41 IST

కేఎల్‌ వర్సిటీ ప్రాసెసర్ల చోరీ కేసులో పురోగతి

ఈనాడు, అమరావతి: జిల్లాలో కేఎల్‌ వర్సిటీ, వీవీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో జరిగిన కంప్యూటర్ల చోరీ కేసుల్లో కీలకమైన సమాచారం పోలీసులకు లభించింది. కంప్యూటర్ల నుంచి ప్రాసెసర్లు వేరు చేసి వాటిని పట్టుకెళ్లటంలో సిద్ధహస్తుడిగా పేరుగడించిన ఒడిశాకు చెందిన పాతనేరస్థుడొకర్ని ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ అతనే చోరీలకు పాల్పడి ఉండొచ్చని గుంటూరు అర్బన్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు సంబంధించి కొన్ని క్లూస్‌ సేకరించి ఆమేరకు బెంగళూరు పోలీసులతో ధ్రువీకరించుకున్నారు. అర్బన్‌ పోలీసులకు అతనిపైనే అనుమానాలు వ్యక్తం కావటంతో పోలీసు బృందం ఒకటి ప్రస్తుతం బెంగళూరు చేరుకుంది. కేఎల్‌ వర్సిటీలో ప్రాసెసర్లు చోరీ కావటానికి ముందు బెంగుళూరు, అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇదే తరహాలో చోరీలు జరిగాయి. ఆయా కళాశాలల్లో కూడా ప్రాసెసర్లు మాత్రమే పట్టుకెళ్లినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇవన్నీ ఒకే తరహాలో జరిగాయని వాటన్నింటిని ఒకే నిందితుడి చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని