logo

కొంగ నల్లన.. మెడ తెల్లన..

సూర్యలంక తీరానికి అరుదైన కొంగలు వలసొచ్చాయి. నల్లని రెక్కలతో కనిపించే ఈ కొంగల మెడ మాత్రం తెల్లగా కనిపిస్తుంది. ఇండో- చైనా సరిహద్దు, ఉత్తర సుమత్రా దీవులు, ఫిలిప్పైన్స్‌, మలయా ద్వీపకల్పం, ఆఫ్రికాలోని సహారా దక్షిణ భాగంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటిని అంతరించిపోతున్న

Published : 23 Jan 2022 01:41 IST

సూర్యలంక తీరానికి అరుదైన కొంగలు వలసొచ్చాయి. నల్లని రెక్కలతో కనిపించే ఈ కొంగల మెడ మాత్రం తెల్లగా కనిపిస్తుంది. ఇండో- చైనా సరిహద్దు, ఉత్తర సుమత్రా దీవులు, ఫిలిప్పైన్స్‌, మలయా ద్వీపకల్పం, ఆఫ్రికాలోని సహారా దక్షిణ భాగంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటిని అంతరించిపోతున్న పక్షి జాతిగా పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. సూర్యలంక వాయుసేన కేంద్రం సమీపంలో చప్టా వద్ద పర భూముల్లో ఐదు తెల్ల మెడకొంగలు ఆహారం కోసం చేపల వేట సాగిస్తూ ఉండగా బాపట్లకు చెందిన పక్షి ప్రేమికుడు, పర్యావరణవేత్త రమణ తన కెమెరాలో బంధించారు. ఈ ప్రాంతంలో తొలిసారిగా తెల్ల మెడ కొంగలు కనిపించాయని ఆయన తెలిపారు. మన దేశానికి వలసొచ్చే ఈ కొంగలు శీతకాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణానికి వస్తాయని వెల్లడించారు. - బాపట్ల, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని